13 June, 2026 | 1:46 PM

Breaking News

ఘనంగా మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు   •   బిజెపి పార్టీ పటిష్టతకు కృషి చేస్తా: ఓబీసీ జిల్లా అధ్యక్షులు   •   మంత్రి జూపల్లి కృష్ణారావు ఘనంగా స్వాగతించిన నియోజకవర్గ ఇన్చార్జ్   •   గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించండి: ఎమ్మెల్యే జాదవ్ అనిల్   •   తెలంగాణ ఉద్యమంలో రేవంత్ ఒక్కనాడైనా పాల్గొన్నారా?: KTR   •   భవిష్యత్ యుద్ధాలకు సిద్ధంగా ఉండండి.. క్యాడెట్లకు రాజ్‌నాథ్ సింగ్ సూచన   •   పెండింగ్ వంతెనలు పూర్తి చేయాలి   •   కొట్టుకుపోయిన వంతెన వద్ద మరమ్మత్తులు   •   పాఠశాలలో దోమల నివారణ మందు పిచికారీ   •   శ్రీ వాసవి మాత దేవాలయం లో ప్రత్యేక పూజలు   •  

గొప్ప అభ్యుదయ వాది డాక్టర్ బీఆర్ అంబేద్కర్

14-04-2026 01:24 PM

అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్

అమీన్ పూర్: భారతదేశ చరిత్రలో అజరామరమైన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్ అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అమీన్ పూర్ గ్రామ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు  అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలోసమానత్వం, సామాజిక న్యాయం, స్వేచ్ఛ అనే విలువల కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు అంబేద్కర్ అన్నారు.  అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన కృషి అపారము అని కొనియాడారు. అంబేద్కర్  ఆలోచనలు ఈ రోజుకీ ప్రతి ఒక్కరికి ప్రేరణ అని. . సమానత్వం కోసం, మానవ హక్కుల కోసం ఆయన చూపిన దారి మనందరికీ ఆదర్శప్రాయం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం, సీనియర్ నాయకులు ఉపేందర్ రెడ్డి, ప్రమోద్ రెడ్డి, కృష్ణ, సునీత రాజేష్, యాదగిరి, దాసు యాదవ్, జ్ఞానేశ్వర్, రుశ్వంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.