1 May, 2026 | 10:40 PM

Breaking News

కలం కార్మికులే సమాజానికి దిక్సూచి   •   రైతన్న ఆందోళన చెందకు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తా నష్టపరిహారం ఇప్పిస్తా ఎమ్మెల్యే   •   ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి   •   మేడే స్ఫూర్తితో కార్మిక హక్కుల పరిరక్షణకై పోరాటాలు ఉదృతం చేయాలి   •   ఆర్టిసీ కార్మికులకు అండగా నిలిచిన ప్రభుత్వం   •   బాల భరోసా కార్యక్రమం సక్సెస్ చేద్దాం   •   14వ డివిజన్ ఆటో అడ్డాలో మేడే వేడుకలు   •   పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పురస్కారం   •   పదవి విరమణ పొందిన ఎస్పీ రతన్ రంజన్ కుమార్‌కు ఘన సన్మానం   •   ద్విచక్ర వాహనాలను దొంగలించిన దొంగ దొరికాడు   •  

ముళ్లపొదల్లో పసికందు

02-11-2024 02:22 AM

వనపర్తి, నవంబర్ 1 (విజయక్రాంతి): అప్పుడే  పుట్టిన పసికంద ను కనికరం లేని ఓ తల్లి ముళ్లపొదల్లో పడేసింది. పొదల నుంచి బిడ్డ ఏడుపు విన్న స్థానికులు యంత్రాంగానికి సమాచారం ఇవ్వగా, వారు ఘటనా స్థలానికి చేరుకుని బిడ్డను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. తెలిసిన వివరాల ప్రకారం.. అమరచింత మండలంలోని కృష్ణంపల్లిలోని ముళ్ల పొదల నుంచి ఆదివా రం ఉదయం గ్రామస్తులకు పసికందు ఏడుపు వినిపించింది.

వెంటనే వారు అంగన్‌వాడీ టీచర్ శశికళకు సమాచారం ఇచ్చారు. ఆమె వెంటనే ఎంపీడీబీవో, తహసీల్దార్, ఐసీడీఎస్ అధికారులకు తెలిపింది. వారంతా ఘటనా స్థలానికి చేరుకుని పసికందును ఆత్మకూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.