28 June, 2026 | 1:04 AM

రాకాతో మళ్లీ!

28-06-2026 12:07 AM

రష్మిక మందన్న ప్రస్తుతం ‘కాక్‌టెయిల్ 2’ విజ యోత్సాహంలో ఉన్నారు. ఇటీవలే థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబ డుతోంది. రష్మిక, షాహిద్ కపూర్, కృతి సనన్ నటిం చిన ఈ సినిమా విడుదలైన 8 రో జులకే రూ.74 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు బాక్సాఫీస్ నివేదికలు చెబుతున్నాయి. ఇక రష్మిక ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘మైసా’ చిత్రం నుంచి నటి నిధి సింగ్ పాత్రకు సంబంధించిన లుక్ పోస్టర్ విడుదలైంది.

ఈ సినిమా 2026లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలావుంటే, రష్మిక గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త వినవస్తోంది. దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘రాకా’లో రష్మిక మరోసారి అల్లు అర్జున్‌తో కలిసి నటించనుందనేదే ఆ వార్తల సారాంశం. ‘పుష్ప’ సినిమా రెండు భాగాల్లో పుష్పరాజ్ ప్రేయసిగా, శ్రీమతిగా శ్రీవల్లి పాత్రలో అలరించింది రష్మిక. ఇప్పుడీ జంట మరోసారి తెరపై సందడి చేయనున్నారట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడేదాకా ఆగాల్సిందే.