28 June, 2026 | 2:17 AM

మధుయాష్కి గౌడ్‌కు జలమండలి ఉద్యోగుల ఘన సన్మానం

28-06-2026 12:59 AM

బంజారాహిల్స్, జూన్ 27 (విజయక్రాంతి): తెలంగాణ జలమండలి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సాధించిన విజయోత్సాహంలో తెలంగాణ జలమండలి ఎంప్లాయి స్ యూనియన్ ప్రతినిధులు టీపీసీసీ ప్రచా ర కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ, యూనియన్ గౌరవాధ్యక్షుడు మధు యాష్కీ గౌడ్ ను ఘనంగా సత్కరించారు.బంజారాహిల్స్లోని ఆయన నివాసంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, ఉద్యో గులు పెద్ద సంఖ్యలో పాల్గొని గజమాలలు, పూలమాలలతో సన్మానం చేసి కృతజ్ఞతాభివందనాలు తెలిపారు.

ఇటీవల జరిగిన గు ర్తింపు సంఘం ఎన్నికల్లో యూనియన్ విజయానికి మధుయాష్కి గౌడ్ అందించిన మార్గదర్శకత్వం, నిరంతర సహకారం కీలకమైందని ప్రతినిధులు పేర్కొన్నారు.డప్పు వాయిద్యాల నడుమ ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల్లో విజ యం సాధించిన యూనియన్ ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు.

ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ఐ క్యంగా ముందుకు సాగాలని, ఉద్యోగుల స మస్యల పరిష్కారానికి యూనియన్ మరిం త సమర్థంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర రాజ్, అసోసియేట్ ప్రెసి డెంట్ అల్లి శ్రవాన్ కుమార్, సయ్యద్ అక్తర్ అలీ, ఎం.రాంచేందర్, బి.శంకర్ ప్రకా ష్, సయ్యద్ హాసిం, రమేష్, కృష్ణ ముదిరాజ్, రాములు ముదిరాజ్, లక్ష్మణ్ యాదవ్, ఏ. అశోక్, వి. కృష్ణ, వినోద్ గౌడ్, ఘోసే పాషా, షేర్ బహదూర్, సీహెచ్. ప్రవీణ్ కుమార్, అమీర్ ఖాన్, బి. మహేష్ పాల్గొన్నారు.