27 July, 2026 | 8:10 PM

Breaking News

ఉరుమడ్ల మహిళల సత్తా.. రాష్ట్ర స్థాయి త్రోబాల్ పోటీలకు అర్హత.   •   విత్తనాల మేళాను సద్వినియోగం చేసుకోండి   •   తరుగు పేరుతో రూ.71 లక్షల అవినీతి   •   మండల సమావేశాన్ని బహిష్కరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు   •   దోరకుంటలో వన మహోత్సవం   •   చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి కాలువ నీరు అందించాలి   •   ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం   •   మూడేళ్లుగా కూలిన హాస్టల్ గోడ.. పునర్నిర్మించాలని పీడీఎస్‌యూ డిమాండ్   •   దళితుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి   •   సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్, శాటిలైట్ హక్కులు   •  

బడిబాటను విజయవంతం చేయాలి

30-05-2024 01:56 AM

సంగారెడ్డి కలెక్టర్ వల్లూరి క్రాంతి

జహీరాబాద్, మే 29 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి చేపట్టనున్న బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు. జహీరాబాద్ డివిజన్‌లోని హగ్గెలి, పస్తాపూర్ పాఠశాలలను బుధవారం ఆమె సందర్శించారు. పాఠశాలల ప్రారం భం నాటికి అభివృద్ధి పనులు పూర్తి  చేయాలని అధికారులకు సూచించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ రాజు, తహసీల్దార్ రవీందర్, పీఆర్ ఈఈ కోటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

భూసేకరణ వేగవంతం చేయాలి..

జహీరాబాద్ డివిజన్ పరిధిలోని న్యాల్‌కల్, ఝరా సంఘం మండలాల్లో చేపట్టిన నిమ్జ్ భూమి సేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ క్రాంతి అన్నారు. జహీరాబాద్ లోని నిమ్జ్ కార్యాలయంలో భూ సేకరణకు సంబంధించి అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు.