అంబరాన్నంటేలా ఆవిర్భావ సంబురాలు
మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్/పాపన్నపేట, మే 29 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబు రాలు అంబరాన్నంటేలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారుల కు సూచించారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి మొదలుకొని రాష్ట్రస్థాయి వరకు ప్రతి ఒక్కరినీ వేడుకల్లో భాగస్వాములను చేయాలని తెలిపారు. గ్రామాల్లో సర్పంచుల పదవీకాలం ముగిసినందున ప్రత్యేకాధికారులు పతాకావిష్కరణ చేస్తారని తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించాలని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు లేదని, తప్పనిసరిగా రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో పాల్గొనాలని ఆదేశించారు.
ఏకరూప దుస్తులు సిద్ధం చేయాలి..
పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు ఏకరూప దుస్తులు సిద్ధం చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. పాపన్నపేట మండలంలోని పొడిచన్‌పల్లి గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏకరూప దుస్తులను సిద్ధం చేస్తుండగా కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. అలాగే పొడిచన్‌పల్లి, ఎల్లాపూర్ పాఠశాలలను సందర్శించి అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు.






