27 July, 2026 | 7:18 PM

‘పోస్టల్’ లెక్కింపుపై అవగాహన ఉండాలి

30-05-2024 01:57 AM

కలెక్టర్ హనుమంత్ కే జండగే

యాదాద్రి భువనగిరి, మే 29 (విజయక్రాంతి): పూర్తి అవగాహనతో పోస్టల్ బ్యాలె ట్ ఓట్ల లెక్కింపు జరపాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హను మంత్ కే జండగే సూచించారు. కౌంటింగ్ విధులు నిర్వహించే ఏఆర్‌వోలు, సూపర్‌వైజర్లు, అసిస్టెంట్ సూపర్‌వైజర్లకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై బుధవారం శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి పోస్టల్ ఓట్లు లెక్కించనున్నట్లు వివరించారు. పూర్తి పారదర్శకతతో లెక్కింపు జరపాలని తెలిపారు. ట్రైనర్ నర్సిరెడ్డి, హరినాథ్ రెడ్డి, జెడ్పీ సీఈవో శోభారాణి పాల్గొన్నారు.

రెండు రోజుల్లో కొనుగోళ్లు పూర్తికావాలి

జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు మే 31 వరకు పూర్తి కావాలని కలెక్టర్ హనుమంత్ కే జండగే అధికారులను ఆదేశించారు. పోచంపల్లి మండలం శివారెడ్డిగూడెంలోని కొనుగో లు కేంద్రాన్ని సందర్శించిన ఆయన.. అధికారులకు, నిర్వాహకులకు పలు సూచనలు చేశా రు. రామలింగాలపల్లిలోని కన్యకాపరమేశ్వరి రైస్ మిల్లును సందర్శించారు. సివిల్ సప్లయి జిల్లా మేనేజర్ గోపీకృష్ణ, డీఎస్‌వో శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.