calender_icon.png 25 June, 2025 | 3:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బగళాముఖీ.. మా గ్రామేశ్వరి

25-06-2025 12:17:14 AM

‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో ఆసక్తికర చిత్రం ‘తమ్ముడు’. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమిగౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జూలై 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ప్రచార కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తోంది. ఇందులో భాగంగా ఈ సినిమా నుంచి ‘జై బగళాముఖీ’ అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు సాహిత్యాన్ని అందించిన ఈ పాటకు అజనీష్ లోకనాథ్ ఆధ్యాత్మికత ఉట్టేపడే బాణీలో స్వరపర్చగా, అబీ వీ ఆలపించారు. ‘జై బగళాముఖీ.. జై శివనాయకీ..  జననీ.. మమ్మేలవే మాలినీ.. మా గ్రామేశ్వరి.. సంగ్రామేశ్వరి..’

అంటూ సాగుతోందీ పాట. గ్రామ జాతర సందర్భంగా శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి మహిమను కీర్తిస్తూ ఈ పాటను చిత్రీకరించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్; ఎడిటర్: ప్రవీణ్ పూడి.