25-06-2025 12:15:34 AM
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న రిలీజ్ కాబోతోంది. మోహన్‌బాబు నిర్మాణంలో రూపొందిందీ చిత్రం. దర్శకుడు ముఖేశ్‌కుమార్‌సింగ్ మీడియాతో చిత్రం గురించి ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు.
విష్ణు చెప్పేదాకా నాకు కన్నప్ప గురించి పెద్దగా తెలీదు. ఈ కథ చెప్పిన తర్వాత చాలా రీసెర్చ్ చేశాను. మళ్లీ మోహన్‌బాబు మహాభారతం సీరియల్ గురించి, ఈ ప్రాజెక్ట్ గురించి చర్చించారు. అలా నన్ను ఫైనల్ చేశారు. ‘కన్నప్ప’ మీద వచ్చిన కన్నడ, తెలుగు, హిందీ చిత్రాలన్నీ చూశాను. వారిలానే నేనూ న్యాయం చేయాలనుకున్నా.
ఇందులో ఎవరి క్యారెక్టర్ కూడా అలా వచ్చి ఇలా వెళ్లేలా ఉండదు. అన్ని పాత్రలు ప్రేక్షకులపై కచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తాయి. విష్ణు కన్నప్ప పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. ప్రభాస్ పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటుంది.
నేను ఇంతవరకు బుల్లితెరపై చేసినవన్నీ హై బడ్జెట్ ప్రాజెక్టులే. ‘మహా భారతం’ సీరియల్‌ను రూ.200 కోట్లతో తీశాం. అంతర్జా తీయ సంస్థలతో కలిసి ఇంగ్లీష్ చిత్రాల్ని నిర్మించాను. బుల్లితెరకైనా, వెండితెరకైనా ఒకే మైండ్ సెట్‌తో పనిచేస్తాను.
కన్నప్పపై వచ్చిన గత చిత్రాల్లోనూ లిబర్టీ తీసుకున్నారు. ఇందులోనూ కొంత వరకు ఫిక్షనల్ ఉంటుంది. శ్రీకాళహస్తి అర్చకులకు ఈ సినిమాను చూపించాం.. అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు.
మా ఆర్ట్ డైరెక్టర్ చాలా రీసెర్చ్ చేశారు. ఎన్నో మ్యూజియంలను సందర్శించారు. వెపన్స్, క్యాస్టూమ్స్‌పై చాలా పరిశోధనలు చేశాం. రెండో శతాబ్దం వాతావరణం తెరపైకి తీసుకురావడానికి చాలా ప్రయత్నించాం. అందుకే మూవీని న్యూజిలాండ్‌లో షూటింగ్ చేశాం.
కన్నప్ప అనేవాడు ఉండేవాడు.. తన కంటిని శివుడికిచ్చాడు. కానీ, ఎవ్వరికీ సరిగ్గా తెలీదు. కన్నప్ప అనేది మైథలాజీ కాదు.. ఇది మన హిస్టరీ. ఓ ఘటన జరిగితే.. ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతుంటారు.
మహాభారతం సీరియల్‌ను సినిమాగా తీయాలనుకుంటున్నా. మహాభారతం పబ్లిక్ ప్రాపర్టీ. ఎవరైనా తీసుకోవచ్చు.. రాజమౌళి తీసుకోవచ్చు.. ఆమిర్‌ఖాన్ తీసుకోవచ్చు. అది పబ్లిక్ డొమైన్‌లో ఉన్న సబ్జెక్ట్.