బహుజన జాతులకు రాజకీయ చైతన్యం రావాలి
- గ్రామ గ్రామాన సామాజిక, సాంస్కృతిక ఉద్యమాన్ని విస్తరించాలి..
- బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు తోట్ల రాఘవేంద్ర ముదిరాజ్
ఆదిలాబాద్,(విజయక్రాంతి): బహుజన జాతులు రాజకీయ చైతన్యం చేయాలని ఏళ్లుగా అనేక రకాలుగా 90 శాతం ఉన్న వర్గాలు మోసగించబడుతున్నాయని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తోట్ల రాఘవేంద్ర ముదిరాజ్ అన్నారు. దళిత శక్తి ప్రోగ్రామ్ రాష్ట్ర కన్వీనర్ అగ్గిమల్ల గణేష్, బీసీ ఎస్సీ ఎస్టీ జెఏసీ రాష్ట్ర కార్యదర్శి అన్నెల లక్ష్మణ్ ఆధ్వర్యంలో దస్నాపూర్ కురుమ సంఘ భవనంలో నిర్వహించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
అణగారిన, అట్టడుగున ఉన్న వర్గాలు రాజకీయంగా, రాజ్యాధికారం దిశగా ప్రయాణించలేక దోపిడికి గురవుతున్నాయని, పార్టీలకతీతంగా అందరి మన జాతుల చైతన్యం కోసం ఉద్యమించాలని పేర్కొన్నారు. గ్రామ, మండల స్థాయిలో బహుజన జాతుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని పేర్కొన్నారు. అగ్రవర్ణాలు అన్ని ఉద్యమాలలో మనల్ని బలిపశువులుగా చేస్తున్నారని, ఇక నైనా మహనీయుల ఆలోచనలతో నడవాలని పిలుపునిచ్చారు. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఛైర్మెన్ డా.విశారదన్ మహరాజ్ తెలంగాణలో అనేక ఉద్యమాలతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ జాతుల విముక్తి కోసం ఉద్యమిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం అదిలాబాద్ జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నూతన కార్యవర్గంను ఎన్నుకున్నారు.
అదిలాబాద్ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా అధ్యక్షులుగా కాశవేణి నారాయణ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులుగా ఎల్లుల సంతోష్, రమేష్ చంద్ర గౌడ్, అల్లూరి భూమన్న, జిల్లా ప్రధాన కార్యదర్శిగా చిట్యాల శ్రీనివాస్ మహారాజ్,బిలీగల్ అడ్వైజరీగా అడ్వకేట్ సామల ప్రశాంత్, జిల్లా కార్యదర్శిగా డ్యాగం వేణుగోపాల్, అమరబోయిన సాయి చరణ్ గౌడ్, జిల్లా జాయింట్ సెక్రటరీలుగా లింగంపల్లి నరసింహులు, భోజరాజు ముదిరాజ్, జుగ్నకు మారుతి, కర్నేవర్ రాకేష్, జిల్లా సలహా సభ్యులుగా కలమడుగు భూమన్న, పసుల రాజు, పసుపుల విజయ్, జిల్లా మీడియా సెక్రెటరీగా మేకల జితేందర్ మహరాజ్, చిట్యాల రాజేశ్వర్ మహరాజ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.






