19 March, 2026 | 11:14 AM

మెస్సి టూర్ నిర్వాహకుడికి బెయిల్ నిరాకరణ

15-12-2025 01:09 AM

14 రోజుల పోలీస్ కస్టడికి ఆదేశించిన నాయస్థానం

కోల్‌కతా, డిసెంబర్ 14: ప్రముఖ అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా శనివారం కోల్‌కతా స్టేడియంలో ఆయన స్వల్ప సమయం గడపడంతో అభిమానులు ఆగ్రహంతో స్టేడి యంలో సీసాలు, ప్లాస్టిక్ కుర్చీలను స్టేడియంలోకి విసిరేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి. దీంతో ఈ ఘటనకు బాధ్యుడైన ‘గోట్ టూర్ ఆఫ్ ఇండి యా’ ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తా ను పోలీసులు ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశా రు.

దత్తాను బిధాన్నగర్ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చా రు.అక్కడ అతని న్యాయవాది బెయిల్ కోసం అప్పీల్ చేయగా, పోలీసులు 14 రోజుల  కస్టడీకి డిమాండ్ చేశారు. బిధాన్నగర్ కోర్టు అరెస్టు చేసిన నిర్వాహకుడిని కస్టడీకి పంపింది.

ఈవెంట్ సరిగా నిర్వహించకుండా గందరగోళానికి కారణమయ్య డన్నది శత్రదుపై ఆరోపణ. కాగా ఈ ఘటన రాజకీయానికి దారి తీసింది. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమ ర్శలు చేస్తున్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ దుర్ఘటనపై విచారణ జరిపేందుకు ఓ కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ ఆదివారం స్టేడియంను సందర్శించి సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించింది.