19 March, 2026 | 9:39 AM

బ్రౌన్ వర్సిటీలో కాల్పులు

15-12-2025 01:06 AM

ఇద్దరు మృతి.. మరో 8 మందికి తీవ్ర గాయాలు

వాషింగ్టన్, డిసెంబర్ 14: అమెరికాలోని ఓ యూనివర్సిటీలో శనివారం కాల్పుల మోత మోగింది. ఈ ఘటలో ఈ ఘటన జరిగింది. యూనివర్సిటీలో పరీక్షలు జరుగుతున్న సమయంలో దుండుగుడు కాల్పులు జరిపినట్లు ప్రొవిడెన్స్ మేయర్ బ్రెట్ స్మైలీ వెల్లడించారు. నల్లడి దుస్తులు ధరించిన ఓ వ్యక్తి ఈ కాల్పులు జరిపి ఇంజనీరింగ్ భవనం నుంచి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు అన్ని చర్యలు చేపట్టాన్నారు.

కాగా ఘటన జరిగిన వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు యూనివర్సిటీ అధికారులు మొదట ప్రకటించినా.. ఆ తర్వాత ఖండించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.

ఘటన గురించి అధికారులు తనకు సమాచారం అందించారన్నారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాని సోషల్ మీడియలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం యూనివర్సిటీ క్యాంపస్‌ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.