బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్‌కు బెయిల్
మంజూరు చేసిన హైకోర్టు
హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. బుధవారం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. సింగరేణి అధికారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నందుకు ఆయనపై కేసు నమోదైంది.
గత మే 26న జరిగిన పార్టీ సమావేశంలో బాల్క సుమన్ నాంపల్లిలోని సింగరేణి భవన్, మందమర్రిలోని జనరల్ మేనేజర్ కార్యాలయ అధికారులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో సింగరేణి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, మే 30న తెలంగాణ భవన్‌లో సుమన్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసులో బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరైంది. ఇద్దరు వ్యక్తుల పూచీకత్తును సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.






