12 April, 2026 | 2:45 PM

బెయిలే ముఖ్యం

29-08-2024 12:00 AM
  1. పీఎంఎల్‌ఏ కేసుల్లోనూ ఇదే సూత్రం 
  2. సుప్రీంకోర్టు కీలక తీర్పు

న్యూఢిల్లీ, ఆగస్టు 28: ‘బెయిల్ ఈజ్ రూల్.. జైల్ ఈజ్ ఆప్షనల్’ అనే నియమం మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కేసులకు కూడా వర్తిస్తుందని సుప్రీం కోర్టు ప్రకటించింది. వ్యక్తి స్వేచ్ఛకే ప్రధాన్యమని తేల్చిచెప్పింది. మనీలాండరింగ్ కేసు లో అరెస్టయిన జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ అనుచరుడు ప్రేమ్‌ప్రకాశ్ బెయిల్ పిటిషన్‌పై స్పంది స్తూ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్‌తో కూ డిన ధర్మాసనం బుధవారం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రేమ్‌కు బెయిల్ మంజూరు చేసిం ది. బెయిల్ తిరస్కరిస్తూ జార్ఖండ్ హైకోర్టు తీర్పును కొట్టివేసింది. పీఎంఎల్‌ఏ కేసుల్లో నిందిడుతు దర్యాప్తు అధికారి ముందు ఇచ్చే నేరాంగీకార వాగ్మూలాన్ని కేసులో ఎవిడెన్స్‌గా పరిగణించలేమని తెలిపింది.