12 April, 2026 | 4:23 PM

గుజరాత్‌ను ముంచెత్తిన వరదలు

29-08-2024 12:00 AM

గాంధీనగర్, ఆగస్టు 28: భారీ వర్షాలతో గుజరాత్‌ను వరదలు ముంచెత్తాయి. ద్వారక, ఆనంద్, వడోధర, ఖేడా, మోర్బీ, రాజ్‌కోట్ జిల్లాలో వరద తీవ్రత అధికంగా ఉన్నది. వరదల కారణంగా 29 మంది మరణించారని, 20 వేల మంది నిరాశ్రయు లయ్యారని అధికారులు తెలిపారు. వరదల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు ఆరు సైనిక బృందాలను రంగంలోకి దించారు. విపత్తు నిర్వహణ బృందాలు 300 మందిని కాపాడాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి వరద పరిస్థితిని సమీక్షించారు.