14 May, 2026 | 4:03 AM

బక్రీద్ పండగను శాంతియుతంగా జరుపుకోవాలి

14-05-2026 03:00 AM

అర్మూర్, మే 13 (విజయ క్రాంతి) : ఈ నెల 27న జరిగే బక్రీద్ పండగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని అర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం అర్మూర్ పట్టణంలో  నిజామాబాద్ సిపి సాయి చైతన్య ఆదేశాలతో మేరకు ముస్లీమ్ మత పెద్దలతో సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ పండుగ సందర్భంగా తీసుకోవలసిన భద్రత చర్యలు, ప్రజల సహకారం, శాంతి భద్రతల పరిరక్షణపై వివరించారు. పండగకు కావాల్సిన ఏర్పాట్లను అన్ని శాఖల సమన్వయంతో ముందుకు ముందుకు వెళ్తామని అన్నారు. ఈ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ నరేందర్, వెటర్నటి డాక్టర్ ప్రభాకర్, రూరల్ సీఐ జాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.