2 August, 2026 | 8:13 AM

పేదవారికి ఉచితంగా వైద్యం అందిస్తున్నాం: బాలకృష్ణ

22-06-2024 03:14 PM

హైదరాబాద్: క్యాన్సర్ మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తోందని ప్రముఖ టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆస్పత్రి సేవల విస్తరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి సహకారం కోరామని తెలిపారు. కోరిన వెంటనే సీఎం అంగీకరించారని బాలకృష్ణ వెల్లడించారు. దాతల సహకారంతోనే బసవతారకం ఆస్పత్రి ఈ స్థాయికి చేరుకుందన్నారు. బసవతారకం ఆసుపత్రి సేవలు మరింత విస్తరించాలన్నారు. బసవతారకం ఆస్పత్రిని ప్రజల కోసం నిర్మించామని బాలయ్య తెలిపారు. అభివృద్ధి అంటే సేవలందంచడం అన్నారు. పేదవారికి ఉచితంగా వైద్యం అందిస్తున్నామని, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ 24వ వార్షికోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి, మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ, డాక్టర్ నోరి దత్తాత్రేయుడు హాజరయ్యారు.