2 August, 2026 | 7:09 AM

2 లక్షల రుణమాఫీపై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

22-06-2024 03:26 PM

హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వం అన్నదాతలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ నేత, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిఅన్నారు. 2 లక్షల రుణమాఫీ ఎవరికీ వర్తిస్తుందో చెప్పాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి వర్గం ఉపసంఘం పేరుతో రుణమాఫీ జాప్యం చేస్తోందని విమర్శించారు. తొమ్మిదిన్నర ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో రైతాంగంపై సుమారు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారన్నారు. మీరు రైతు రుణమాఫీకి 31 వేల కోట్లు అయితుందని గొప్పగా చెప్తున్నారు.

ఆకాశానికి అంటేలా మీటర్ పెట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నారని నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంఖ్య 68 లక్షల 99 వేలు ఉందన్న మాజీ మంత్రి, కేసీఆర్ ప్రభుత్వంలో రైతుబంధు 11 విడుతలుగా 72,815 కోట్లు ఇచ్చామన్నారు. ఒక కోటి 52 లక్షలకు ఎకరాల భూమికి రైతు బంధు ఇచ్చామని తెలిపారు. ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకి, గుట్టలకు రైతు బంధు ఇచ్చి ఉంటే, ఈ 7 నెలల్లో ఎందుకు ఆ లెక్కలు బైట పెట్టలేదని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.