8 April, 2026 | 11:23 PM

ముగిసిన బాలమల్లేశ్ అంత్యక్రియలు

02-12-2024 01:06 AM

నివాళులర్పించిన ప్రముఖలు

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 1 (విజయక్రాంతి): నమ్మిన సిద్ధాంతం కోసం తుదిశ్వాస వరకు పోరాడిన వ్యక్తి సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి బాలమల్లేశ్ అని వామపక్ష, రాజకీయ పార్టీలు,  ప్రజాసంఘాలు, మేధావులు కొనియాడారు. ఆయన భౌతిక కాయాన్ని సందర్శనార్థం ఆదివారం హిమాయత్‌నగర్‌లోని మగ్ధూం భవన్‌లో ఉంచారు.

ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు విచ్చేసి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమా ర్  గౌడ్, సీఎం సలహాదారు వేంనరేందర్‌రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు బోయినపల్లి వినోద్‌కుమార్,  శ్రీనివాస్, డా.చెరుకు సుధాకర్, పల్లె రవికుమార్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు వీరయ్య, నర్సింహ, సాగర్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న బాలమల్లేశ్ భౌతికకాయానికి నివాళులర్పించారు. మగ్దూం భవన్ నుంచి మల్లేశ్ స్వగ్రామం యాప్రాల్ వరకు అంతిమయాత్ర నిర్వహించారు.