సింగరేణి నర్సింగ్ కళాశాల బిల్డింగ్‌ను ప్రారంభించిన బలరామ్
కొత్తగూడెం, మార్చి 31 (విజయ క్రాంతి)సింగరేణి మెయి న్ హాస్పిటల్ నందు నూతనముగా నిర్మించిన,సింగరేణి నర్సింగ్ కళాశాల భవనాన్ని సోమవారం సింగరేణి ఛైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ శ్రీ ఎన్. బలరామ్ ప్రారంభించారు. సిఎం ఓ శ్రీమతి పి.సుజాత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.సింగరేణి మెయిన్ హాస్పిటల్ నందు నూతనముగా రూ3.46 కోట్ల వ్యయం తో అత్యదునికముగా నిర్మించిన సింగరేణి నర్సింగ్ కళాశాల బిల్డింగ్ ను ప్రారంభించుకోవటం చాలా సంతోషకరం అని తెలిపారు.
వైధ్య రంగం లో నర్సుల పాత్ర చాలా గొప్పది అని,పేషెంట్ హాస్పిటల్ లో అడ్మిట్ అయిన దగ్గర నుండి డిశ్చార్జ్ అయ్యే వరకు ఎంతో అంకిత భావముతో సేవ చేస్తారని, అలాంటి కోర్సును సింగరేణి నర్సింగ్ కళాశాల నందు విజయవంతముగా 1960 సంవత్సరము నుండి నిర్వహింకూకుంటున్నామని, మన నర్సింగ్ కళాశాల లో విధ్య పూర్తి చేసుకున్న నర్సింగ్ విద్యార్ధులు మొత్తం 825 మందిలో 500 మంది సింగరేణి సంస్థలో, 200 మంది విద్యార్ధులు ప్రభుత్వ ఆసుపత్రులలో, 153 మంది విదేశాలలో,ప్రైవేటు ఆసుపత్రులలో ఉద్యోగం పొందారని, 54 మంది ప్రస్తుతం కళాశాలలో చదువుతున్నారని, 21 మంది పరీక్షలు వ్రాసి ఫలితాల గురించి ఎదురుచూస్తున్నారని తెలిపారు.
ప్రస్తుతం ఉన్న జిఎన్‌ఎం నర్సింగ్ కోర్సు తో పాటు బిఎస్సి నర్సింగ్ కోర్సు ను కూడా ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. సింగరేణి ఉద్యోగుల పిల్లలతో పాటు, ఇతర ఏరియాల పిల్లలకు కూడా నాణ్యమైన నర్సింగ్ విద్యను అందించటమే లక్ష్య మన్నారు.సింగరేణి సంస్థ కార్మికుల, ఉద్యోగుల సంక్షేమం విషయములో ముందు వరుసలో ఉంటుంది అని కార్మికులకు మెరుగైన వైద్యం అందించేందుకు,మన సింగరేణి ప్రధాన ఆసుపత్రి సహా అన్ని ఏరియా ఆసుపత్రులను ఆధునికరించుకున్నామని, అదే విధముగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల వలే సింగరేణి సంస్థలో పనిచేసే డాక్టర్లు, నర్సులు మరియు ఉద్యోగులు మరింత ద్రుడనిశ్చయం తో పని చేయాలని, తద్వారా రోగులకు బయట ఆసుపత్రులకు రిఫర్ చేయకుండా మనదగ్గరనే రోగ నిర్ధారణ చేసి మెరుగైన వైద్యం అండిచగలమని తెలిపారు.
త్వరలో మెయిన్ హాస్పిటల్ నందు సిటి ,ఎం ఆర్‌ఐ స్కాన్ ను ప్రారంభించుకోబోతున్నామని, మన ఆసుపత్రులలోనే కీళ్ల మార్పిడి ఆపరేషన్లను కూడా విజయ వంతముగా నిర్వహించుకున్నామని తెలిపారు. సింగరేణి లో మెయిన్ హాస్పిటల్ ఒక కీర్తి కిరీటం అని, ఆ కీర్తిని ఇనుమడింపజేసేందుకు సింగరేణి మెయిన్ హాస్పిటల్ నందు సేవలను, మెరుగు పర్చడానికి సింగరేణి సంస్థ ముందు ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ శ్రీ ఎన్. బలరామ్, ఐఆర్‌ఎస్, తో పాటు ఇతర అధికారులు, ఉద్యోగులు, సింగరేణి ప్రధాన ఆసుపత్రి సిబ్బంది, హాస్పిటల్ సి బ్బంది ,నర్సింగ్ కాలేజీ యాజమాన్యం, ఇతర అధికారులు, ఉద్యోగులు, యూనియన్ నాయకులు, నర్సింగ్ కళాశాల సిబ్బంది, విధ్యార్ధులు, పూర్వ విధ్యార్ధులు పాల్గొన్నారు.






