18 April, 2026 | 11:13 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లును సమిష్టిగా అడ్డుకుందాం

01-04-2025 12:00 AM

రాజ్యాంగంలో రాసుకున్న హక్కులను తుడిపేసే హక్కు బీజేపీకి లేదు

మోడీ నిర్ణయాలతో ముస్లిం హక్కులకు ప్రమాదం

కొత్తగూడెం శాసనసభ సభ్యుడు కూనంనేని సాంబశివరావు

భద్రాద్రికొత్తగూడెం, మార్చి 31 (విజయ క్రాంతి) : అనాది నుంచి మాతారసమరస్యానికి వేదికగా, ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా కొత్తగూడెం నియోజకవర్గం నిలుస్తోందని, పండుగలన్నీ కులమాతలకతీతంగా జరుపుకుంటూ ఐక్యతను చాటడం హర్షణీయమని కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ సభ్యులు, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. పవిత్ర రంజాన్ పండుగను సందర్బంగా సోమవారం బోడగుట్ట ఈద్గాలను సందర్శించి రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ భిన్న మతాలు, విభినన్న కులాల సమ్మేళనమే భారత దేశమని, అందరం కలిసుంటేనే సమాజంలో శాంతి నెలకొంటుందనీ ,దేశం అభివృద్ధివైపు పయనిస్తుందన్నారు.

పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం కుటుంబాలు ఆచరించే ఫిత్రా, జకార్త్ వంటి నియమాలు పేద వాడి ఆకలిని, శ్రమను గుర్తించే ఏర్పాటు చేసుకున్నవేనని, సంపాదనలో కొంతభాగాన్ని పేదల ఆకలితీర్చేందుకు కేటాయించడం మహోన్నత మైనది, మహమ్మద్ ప్రవక్త బోధనలు ఆచరిస్తే సమాజంలో శాంతి ఆవిష్కృతమవుతుందన్నారు. ముస్లింలకు రాంజ్యాం గం ప్రసాదించిన హక్కులను కాలరాసే కుట్రలకు కేంద్రం పాల్పడుతోందని, అందులో భాగంగానే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తెచ్చేందుకు పూనుకుందన్నారు. 

రంజాన్ మాసంలో ఈ బిల్లును తెరపైకి తెచ్చి ముస్లిం కుటుంబాలను ఆందోళనకు గురి చేస్తోందని విమర్శించారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సమిష్టిగా పోరాడాలని పిలుపునిచ్చా రు.  వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు దేశ లౌకిక, ప్రజాస్వామిక వ్యవస్థకు పెను ప్రమాదమని, రాజ్యంగా పరిరక్షణకు, లౌకిక వాదాన్ని కాపాడేందుకు దేశ ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, ఉర్దూఘర్ చైర్మన్ నయీమ్ ఖురేషి, ఈద్గాల అధ్యక్షులు ఫారూఖ్ ఏస్ధాని, డిఎస్పీ రహమాన్, అబిద్ హుస్సేన్, జహంగీర్ షరీఫ్, రబ్ సహాబ్, యూసుఫ్, జావీద్ సాటే, బాసిత్, ఖాద్రి, యాకుబ్, కాంగ్రెస్ నాయకులు నాగా సీతారాములు, సిపిఐ నాయకులు కంచర్ల జమలయ్య, భూక్యా శ్రీనివాస్, మాచర్ల శ్రీనివాస్, ధర్మరాజు, బోయిన విజయ్ కుమార్, నేరెళ్ల శ్రీనివాస్, పి సత్యనారాయణాచారి తదితరులు పాల్గొన్నారు.