26 June, 2026 | 5:23 PM

చిన్న పంట కొనాలంటూ రోడ్ ఎక్కిన మహిళా రైతు

26-06-2026 04:17 PM

రామాయంపేట: "జొన్న పండించిన రైతుకు గిట్టుబాటు కాదు... కొనుగోలు కోసం వేచి చూస్తున్న మహిళా రైతులకు కన్నీళ్లే మిగిలాయి..! నెల రోజులుగా అధికారులు సాకులు చెబుతూ కొనుగోళ్లు చేపట్టకపోవడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రామాయంపేట పాత జాతీయ రహదారిపై మహిళా రైతులు రాస్తారోకో, ధర్నాకు దిగారు. గంటపాటు హైవేపై బైఠాయించి ప్రభుత్వానికి నిరసన గళం వినిపించారు. ఆరుతడి సాగు చేయాలంటే ముందుగా జొన్న కొనాలని డిమాండ్ చేశారు. దీంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు."