26 June, 2026 | 4:31 PM

విద్యుత్ ఘాతంతో పాడిగేదె మృతి

26-06-2026 03:52 PM

చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండలం, వడియారం గ్రామ పరిధిలో కరెంట్ షాక్ తగిలి  పాడి గేదె మృతి చెందింన సంఘటన చేగుంట మండలం వడియారం గ్రామం చోటు చేసుకొని,  గ్రామానికి చెందిన  రైతు వెల్దుర్తి ఎల్లం కు చెందిన గేదె, తన వ్యవసాయ పొలం వద్ద మేతకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురైంది. ​కుటుంబానికి జీవనాధారమైన గేదె కళ్లముందే ప్రాణాలు విడవడంతో యజమాని ఎల్లం కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.. విద్యుత్ శాఖ అధికారులు  స్పందించి, బాధిత రైతు కుటుంబానికి  ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.