నేపాల్ ప్రధానిగా బాలెన్ షా
ఎన్నికల్లో ఆర్‌ఎస్పీ సునామీ
ఆదివారం రాత్రి వరకు 156 స్థానాల ఫలితాలు వెల్లడి
రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ 120 స్థానాల్లో గెలుపు.. ఆరు చోట్ల లీడింగ్
ఆర్‌ఎస్పీ హోరులో ముగ్గురు మాజీ పీఎంల్లో ఇద్దరు ఓటమి
ఎన్‌ఎస్పీ 17, యూఎంఎల్ 7, ఎన్సీపీ 7 స్థానాల్లో గెలుపు
నేడు పూర్తిస్థాయి ఫలితాలు
కాఠ్మాండు, మార్చి 8: నేపాల్ జెన్‌జీ ఉ ద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆర్‌ఎస్పీ నేత బాలెన్‌షా ఆ దేశ పీఎం పీఠానికి చేరువయ్యారు. నేపాల్ సార్వత్రిక ఎన్నికల ఫలి తాల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్పీ) సత్తా చాటుతోంది. ఈ పార్టీ అభ్యర్థులు కీలక నేతలను ఓడించారు. ముగ్గురు మాజీ ప్రధానులు పోటీ చేయగా.. ఇద్దరు ఓటమి పాల య్యారు. ఆర్‌ఎస్పీ సునామీ ముందు పుష్పకమల్ దహల్ (ప్రచండ) ఒక్కరే విజయం సాధించారు. నాలుగుసార్లు ప్రధాని పనిచేసిన కె.పి.శర్మ ఓలీని ఝాపా-5 నియోజ కవర్గంలో ఆర్‌ఎస్పీకి చెందిన నవతర నేత బాలేంద్ర షా 50 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే.
దేశ పార్లమెంటులోని ప్రజా ప్రతినిధుల సభలో మొత్తం 275 స్థానాలుండగా వాటిలో 165 స్థానాలకు ప్రత్యక్ష ప్రాతిపదికన ఓటింగు జరిగింది. ఆదివారం సాయంత్రం నాటికి 165 స్థానాలకు 156చోట్ల ఫలితాలు వెల్లడయ్యాయి. ఎన్నికల సంఘం వివరాల ప్రకారం ఆర్‌ఎస్పీ ఇప్పటివరకు 120 స్థానాలను గెలు చుకుంది. మరో ఆరుచోట్ల ఆధిక్యం కొనసాగుతోంది. నేపాలీ కాంగ్రెస్ 17, కేపీశర్మ నేతృత్వంలోని సీపీఎన్ (యూఎంఎల్) 7, ఎన్సీపీ 7, ఎస్‌ఎస్‌పీ 3, ఆర్‌పీపీ అభ్యర్థి, ఓ స్వతంత్ర అభ్యర్థి చెరోచోట గెలిచారు.
ర్యాపర్ నుంచి రాజకీయ నేతగా..
కాఠ్మాండూలోని నారాదేవిలో 1990 ఏప్రిల్ 27న బాలేంద్ర షా జన్మించారు. ఈయనను బాలెన్ షాగా పిలుస్తుంటారు. తండ్రి ఆయుర్వేద వైద్యుడు. వీరి కుటుంబం మాదేశ్ నుంచి రాజధానికి వచ్చి స్థిరపడింది. కర్ణాటకలోని ఓ యూనివర్సిటీ నుంచి స్ట్రక్చరల్ ఇంజినీరింగ్లో మాస్టర్స్ చేశారు. ఎప్పు డూ నలుపు కళ్లజోడులో కనిపించే ఈయన ఓ ర్యాపర్ కూడా. మొదట నేపాలీ హిప్-హా ప్లో ఫేమస్ బాలేంద్ర. కొన్నేళ్లలోనే యూత్ ఐకానిక్‌గా మారారు. 2022లో కాఠ్మాండ్ మేయర్ ఎన్నికల్లో సొంతగా పోటీచేసి.. ప్రధాన పార్టీలు, కీలక నేతలను ఓడించి యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచారు.
అనేక సంస్కరణలు చేపట్టి..
మేయర్‌గా మూడున్నరేళ్ల కాలంలోనే రాజధానిలో అనేక సంస్కరణలు చేపట్టారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాలు నిర్వహించడం, అక్రమ కట్టడాలపై కఠినంగా వ్యవహరించడం. ప్రభుత్వ భూములను రక్షించడం, వ్యర్థాల నిర్వహణ వంటి చర్యలతో దూకుడుగా వ్యవహరించారు. గతేడా ది సెప్టెంబర్లో దేశంలో అవినీతి, సామాజిక మాధ్యమాలపై ఆంక్షలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో కీలకపాత్ర పోషించారు. మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కార్కి నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించారు.
కొత్త పార్టీలో చేరి..
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండు నెలల క్రితం కాఠ్మాండు మేయర్ పదవికి రాజీనామా చేసిన బాలేన్‌షా.. ఆర్‌ఎస్పీలో చేరారు. మాజీ టీవీహోస్ట్ రవి లామిచానే సారథ్యంలో 2022లో ఈ పార్టీ ఏర్పాటైంది. ప్రధాని అభ్యర్థిగా బాలేన్‌షాను ఎన్నికల బరిలో దించింది. పొరుగుదేశాలతో ఎన్నో అంశాలపై ఎన్నికల్లో ప్రచారం చేశారు.
ఇవి కూడా చదవండి:




