క్యాన్సర్ ఆసుపత్రిలో అన్నదానం
18-06-2026 02:37 AM
డాక్టర్ ముజీబ్ ఆధ్వర్యంలో నిర్వహణ
హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌ఎం హుస్సేనీ (ముజీబ్), ఆసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవా రం ఎంఎన్‌జె క్యాన్సర్ ఆసుపత్రిలో రోగులకు, సహాయకులకు అన్నదానం చేశారు. తన తల్లిదండ్రులైన ఆసదుద్దీన్, అన్వరున్నీసా స్మారకార్థం ఏర్పాటు చేశారు.
కె.ఆర్. రాజ్ కుమార్ టిఎన్‌జిఓఎస్ యూనియన్ అసోసియేట్ ప్రెసిడెంట్, వైదిక్ శే (పబ్లిసిటీ సెక్రటరీ), ముకీమ్ ఖురేషి (టిఎన్‌జిఓఎస్ యూనియన్ హైదరాబాద్ జిల్లా ఈసి సభ్యు లు), శివ కుమార్ (ప్రెసిడెంట్, ఎంఎన్‌జె. క్యాన్సర్ ఆసుపత్రి యూనిట్), చంద్రశేఖర్ (సెక్రటరీ, ఎంఎన్‌జె క్యాన్సర్ ఆసుపత్రి యూనిట్), మహ్మద్ వాహిద్, మహ్మద్ ముస్తఫా పాల్గొన్నారు.






