18 June, 2026 | 3:22 AM

మొలకలు మాడుతున్నై!

18-06-2026 02:20 AM

మహబూబాబాద్ (విజయక్రాంతి) : రోహిణి కార్తెలో విత్తనం నాటితే మంచి పంట దిగుబడి వస్తుందని తొలకరి వర్షాలకు పత్తి విత్తనాలను నాటిన రైతులకు ఆ తర్వాత వానలు జాడలేక పోవడంతో అంకురించిన పత్తి మొలకలను కాపాడేందుకు అన్నదాతలు అపర భగీరథ ప్రయత్నాలు మొదలెట్టారు.

తొలకరి వర్షాలకు మహబూబాబాద్ జిల్లా కల్వల గ్రామంలో పత్తి విత్తనాలు నాటిన సంద పవన్ అనే రైతు మొలక దశలో ఉన్న పత్తి పంట ఎండలకు మాడిపోకుండా ఉండేందుకు బావి నీటితో తడుపుతున్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ వారంలో వర్షాలు కురవకపోతే.. ముందుగా విత్తనాలు నాటిన పంటలకు నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.