18 June, 2026 | 3:31 AM

ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్

18-06-2026 02:29 AM
  1. చైర్మన్‌గా సీఎస్‌తో సహా మొత్తం 30 మంది సభ్యులు
  2. అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలకు అవకాశం 
  3. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): ఎప్పుడెప్పుడా అని ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చేస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్‌ను ప్రభుత్వం ఎట్టకేలకు ఏర్పాటు చేసింది. చైర్మన్‌గా సీఎస్, మొత్తం 30 మంది అధికారులు, ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ సంఘాల నేతలను సభ్యులుగా చేర్చింది. ప్రభుత్వ ఉద్యోగుల చిరకాల డిమాండ్ అయిన క్యాష్‌లెస్ హెల్త్ స్కీంను క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్‌సీటీ)కు బోర్డు సభ్యులను నియమించింది.

ఈ మేరకు బుధ వారం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీవో ను విడుదల చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ఈ ఎంప్లాయిస్ హెల్త్కేర్ ట్రస్ట్ బోర్డుకు చైర్మన్‌గా తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు వ్యవహరించను న్నారు. మెంబర్లుగా వివిధ ప్రభుత్వ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపాల్ సెక్రటరీ, సెక్రటరీలు ఉన్నారు. అదేవిధం గా పది మంది ఉద్యోగ సంఘాల నేతలను, పెన్షనర్ల అసోసియేషన్ల నుంచి మరో ముగ్గురిని కూడా మెంబర్లుగా నియమించారు.

చైర్మన్ కాకుం డా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కలిపి మొత్తం 29 మంది సభ్యులను నియమించా రు. ఇకపై రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్య పథకానికి సంబంధించిన పూర్తి బాధ్యతలను, నిధుల నిర్వహ ణను ఈ ట్రస్టే పర్యవేక్షించనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు అందించేలా, కొత్త హెల్త్ కార్డుల జారీకి సంబంధించిన పూర్తి విధివిధానాలను రూ పొందించే బాధ్యతను ప్రభుత్వం ఈ ట్రస్ట్ బోర్డుకు అప్పగించింది.

కొత్తగా ఏర్పాటైన ఈ ట్రస్టు సభ్యులంతా వీలైనంత త్వరగా సమావేశమై, పకడ్బందీ విధివిధానాలను రూపొందించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశా రు. ఇదిలా ఉంటే ప్రభుత్వం ట్రస్టును ఏర్పా టు చేయడానికే ఇంత సమయం పడితే ఇక హెల్త్ కార్డులు జారీకి ఇంకెంత సమయం పడుతుందోనని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

హెల్త్ కేర్ ట్రస్టులో మాకు చోటేదీ?: సీపీఎస్ యూనియన్

హెల్త్ కేర్ ట్రస్టులో లక్షలాది మంది ఉద్యోగులుగా ఉన్న సీసీఎస్ యూనియన్‌కు చోటు దక్కకపోవడం విచారకరమని ఆ సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధానకార్యదర్శి కల్వాల శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశా రు. ఈ నూతన బోర్డులో వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులకు సభ్యులుగా అవకాశం కల్పించినప్పటికీ, రాష్ట్రంలోని దాదాపు 2.6 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రాతిని థ్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియ న్‌కు చోటు కల్పించకపోవడం అన్యాయమన్నారు.

దీంతో భవిష్యత్తులో సీపీఎస్ ఉద్యో గులకు ఈహెచ్‌ఎస్ ప్రయోజనాలు అందుతాయో లేదో అనే అనుమానాలు వ్యక్తమవు తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే వైద్య సౌకర్యాలకై రిటైర్డున 2,316 మంది సీపీఎస్ ఉద్యోగులు 1.5 శాతం మొత్తాన్ని చెల్లించలేక ఈహెచ్‌ఎస్ సౌకర్యం పొందడం లేదన్నారు. సీఎం వెంటనే స్పందించి ఈహెచ్‌సీ ట్రస్టు లో సీపీఎస్ యూనియన్‌కు భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 

ఈహెచ్‌సీటీలో పెన్షనర్ జేఏసీకి అన్యాయం

ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్టులో 42 పెన్షనర్స్ సంఘాలతో కూడిన సుమారు 2 లక్షలకుపైగా ఉన్న పెన్షనర్లకు ప్రాతినిథ్యం వహించే తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ జేఏసీకి స్థానం కల్పించకపోవడం అన్యాయమని జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య ఒక ప్రకటనలో తెలిపారు. పెన్షనర్ల పక్షాన ప్రాతినిథ్యం వహిస్తూ ఎన్నో ఉద్యమాల ద్వారా వేలాది పెన్షనర్లను ఏకం చేసి, ఎన్నో సమస్యలను పరిష్కరించామన్నారు. అలాంటి తమ జేఏసీకు స్థానం కల్పించకపోవడం దారుణమని, వెంటనే సభ్యులుగా తమను కూడా చేర్చాలని ఆయన కోరారు.