5 August, 2026 | 12:34 PM

బాల్క సుమన్ అరెస్ట్

21-06-2024 04:00 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. బాల్క సుమన్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటిముందు ఆందోళన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్న సమంయలో ఇంటిలోనికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో బాల్క సుమన్ తో పాటు మరికొందరు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాల్క సుమన్ ను కోర్టుకు తరలిస్తున్న సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర అరెస్ట్ అయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఇతర నాయకులను కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కలిశారు.