కిషన్ రెడ్డి దురదృష్టవంతుడు: ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పదవి తీసుకొని హైదరాబాద్‌లో దిగిన మొదటి రోజే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ద్రోహం చేసే పని చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. కొంత మందికి పదవులు వస్తే అదృష్టం వచ్చింది అనుకుంటాం.. కానీ కిషన్ రెడ్డి దురదృష్టవంతుడు అన్నారు. కిషన్ రెడ్డికి ఎన్ని పదువులు వచ్చినా ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి కూడా చెయ్యలేదని విమర్శించారు. గత అయిదు ఏండ్లలో కిషన్ రెడ్డి చేసింది ఏమైన ఉందంటే అక్కడ ఎక్కడో రైల్వే స్టేషన్లో పాత లిఫ్టును బాగు చేసి ప్రారంభించారని తెలిపారు. ఈసారి క్యాబినెట్ పదవి తీసుకొని హైదరాబాద్ వచ్చిన మొదటి రోజే మన తెలంగాణను ద్రోహం చేసే పని, మన సింగరేణిని నట్టేట ముంచి దానికి ఉరి పెట్టే పని చేశాడు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు.






