హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ
హైదరాబాద్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కళాశాలలే మోసాలకు పాల్పడుతున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్(HYDRA Commissioner Ranganath) సహా ఉన్నతాధికారుల సంతకాలు ఫోర్జరీ అయ్యాయి. హైడ్రా ఉన్నతాధికారుల సంతకాల ఫోర్జరీపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పలు ఇంటర్ కాలేజీలు నకిలీ ఎన్‌వోసీల సమర్పణలపై ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఎనిమిది ఇంటర్ కళాశాలలు నకిలీ ఫైర్ ఎన్‌వోసీలు సమర్పించినట్లు గుర్తించారు.
HYDRAA అదనపు డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, లేక్ పోలీసులు BNSలోని సెక్షన్లు 337, 336(3), 340(2), 318(4) 3(5) కింద కేసు నమోదు చేశారు. . ఎనిమిది కాలేజీల గుర్తింపు రద్దు చేయాలని ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. ప్రియాంక(మెహదీపట్నం), మదర్స్ గర్ల్స్ (విద్యానగర్), శ్రీచైతన్య(చాంద్రాయణగుట్ట), న్యూ ఎరా(చిక్కడపల్లి), షాహీర్(శివరాంపల్లి), వశిష్ట(తెల్లాపూర్), హైందవి( బర్కత్ పురా), రెసిడెన్స్(ఎస్ఆర్ నగర్) కాలేజీలపై హైడ్రా అదనపు డైరెక్టర్(HYDRA Additional Director) ఫిర్యాదు చేశారు.
ఫైర్ ఎన్ వోసీలపై ఉన్నతాధికారుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. కళాశాలలు ఫోర్జరీ సంతకాలతో ఎన్‌వోసీలను ఇంటర్ బోర్డుకు సమర్పించింది. మరో 60 కళాశాలల ఎన్‌వోసీలను పరిశీలిస్తున్నామని అధికారులు వెల్లడించారు. వివిధ జూనియర్ కళాశాలలు సమర్పించిన మొత్తం 76 'ఫైర్ ఎన్‌ఓసి' (Fire NOC)ల ప్రామాణికతను ధృవీకరించేందుకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు వాటిని 'హైద్రా' (HYDRAA) కార్యాలయానికి పంపినప్పుడు ఈ నకిలీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.






