నిర్మల్ జిల్లాలో బంద్ విజయవంతం
10-07-2026 04:12 PM
నిర్మల్,(విజయక్రాంతి): విద్యారంగ సమస్యలను పరిష్కరించి ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్ జిల్లాలో నిర్వహించడం బంద్ విజయవంతమైంది. విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్మల్ ఖానాపూర్ బైంసా ముధోల్ కుంటాల సారంగాపూర్ దిల్వార్పూర్ తదితర మండలంలో ఉదయం నుండి ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛందంగా మూసివేశారు. ఆయా పాఠశాలల వద్ద విద్యార్థి సంఘం నాయకులు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు వెంకటేష్ దిగంబర్ నితిన్ కిరణ్ తదితరులు ఉన్నారు.






