10 July, 2026 | 5:12 PM

పశువుల సిగ్నల్

10-07-2026 04:09 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్ కంటే రోడ్లపై ఉన్న పశువుల సిగ్నలే ఎక్కువగా కనిపిస్తుంది. నిర్మల్ పట్టణంలోని ప్రధాన ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పశువులు రోడ్లపైకి వచ్చి మాఖం వేస్తున్నాయి. పట్టణంలోని మంచిర్యాల్ చౌరస్త, బహిల్ బజార్ బ ఆర్ డి ఓ ఆఫీస్, మయూరి హోటల్ బస్టాండ్ దగ్గర ప్రాంతాల్లో ప్రతిరోజు రోడ్ల పైన పశువులు పందులు కుక్కలు సంచారం చేయడంతో వాహనదారులు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పశువులు ఈ రోడ్డుపై ఎప్పుడు వస్తాయో అన్న భయం నెలకొంది. రోడ్లపైని పశువులు ఆహారం కోసం పోట్లాడుకోవడంతో వానదారులు వాటిని గమనించక ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్లపై పశువులను వదిలితే వాటిని పట్టుకొని గోషాలకు తరలిస్తామని మున్సిపల్ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.