1 July, 2026 | 11:08 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

బండి సంజయ్‌కుమార్ మాటలు అర్థరహితం

02-06-2025 01:54 AM
  1. ఇందిరాగాంధీని అటల్ బిహారీ వాజ్ పేయి దుర్గామాతాగా అభివర్ణించారు 

బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి 

పది సంవత్సరాలు బిఆర్‌ఎస్ తో అంటగాగింది మీరే కదా 

సకాలంలో ధాన్యం కొనుగోలు పూర్తిచేసినందుకు అభినందించాల్సింది పోయి విమర్శలా 

కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి మాటలను ఖండించిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి 

కరింనగర్, జూన్1(విజయక్రాంతి):కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ మాటలు అర్థరహితంగా ఉన్నాయని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నా రు.స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యుద్ధంపై వాస్తవాలు మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దేశద్రోహి అనడాన్ని ఇందిరాగాంధీని విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

ఆనాడు పాకిస్థాన్ అరాచకాలు చూసి బంగ్లాదేశ్ ప్రజలకు విముక్తి కల్పించిన ఘనత ఉక్కు మహిళ ఇందిరాగాంధీకే దక్కుతుందని ఇప్పటిలాగా అమెరికా జోక్యం చేసుకుని యుద్ధం ఆపాలని చూస్తే ఇందిరాగాంధీ వినలేదని ఇందిరా గాంధీ పోరాటపటిమను మెచ్చుకొని బిజెపి వ్యవస్థాపకులు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి దు ర్గా మాతాగా అభివర్ణించారని బండి సంజయ్ కుమార్ కు చ రిత్ర తెలువకపోతే తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికా రు.

పది సంవత్సరాలు బిఆర్‌ఎస్ తో అంటగాగి పార్లమెంటులో అన్ని బిల్లులకు బిఆర్‌ఎస్ ఎంపిల మద్దతు తీసుకొని బిఆర్‌ఎస్ అవినీతిలో భాగస్వాములైన మీరు ఇప్పుడు బిఆర్‌ఎస్ కు కాంగ్రెస్ కు ముడి పెట్టడం విడ్డూరంగా ఉందని విమ ర్శించారు.ల్ వర్షాలు పదిహేనురోజులు ముందు వచ్చినప్పటికి రైతుకు ఎటువంటి నష్టం జరుగకుండా ధాన్యం కొను గోలు పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని సకాలంలో ధాన్యం కొనుగోలు పూర్తి చేసినందుకు ప్రశంసించాల్సింది పో యి విమర్శించడమేంటని నరేందర్ రెడ్డి మండిపడ్డారు.

పది సంవత్సరాలు బిఆర్‌ఎస్,బిజెపి కలిసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినప్పటికి చిత్తశుద్ధితో ఆరు గ్యారంటీలను అమలు పరస్తున్నామని అన్నారు.రాజీవ్ యువవికాసం ద్వారా స్వయంఉపా ధి కల్పన కల్పించడాన్ని మరియు ఇందిరమ్మ ఇండ్లు మం జూరు చేయడాన్ని చూసి తట్టుకోలేక ఉనికి కోసం విమర్శిస్తున్నారని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.ఈ విలేఖరుల సమావేశం లో ఎండి తాజ్,శ్రవణ్ నాయక్,గుండాటిశ్రీనివాస్ రెడ్డి,కుర్ర పోచయ్య,మ్యాకలనర్సయ్య,ఎట్టం వేణు, మేరాజ్,మాసుం ఖాన్,అంజయ్య,నదీం తదితరులు పాల్గొన్నారు.