16 April, 2026 | 4:12 PM

Breaking News

నాగిరెడ్డిపేట్ మండల జాగృతి పద్మశాలి అధ్యక్షుడిగా ప్రవీణ్ కుమార్ నియామకం   •   రోడ్డు భద్రతకై వాహనదారులకు కంటి పరీక్షలు తప్పనిసరి   •   ప్రజా పాలన మండల స్థాయి సమావేశం   •   సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు   •   సురక్షిత ప్రయాణానికి కంటి చూపు ప్రధానం   •   మహిళా రిజర్వేషన్ బిల్లు— ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ హెచ్చరిక   •   డీలిమిటేషన్, సవరణ బిల్లులపై ప్రతిపక్షాల నిరసన.. లోక్‌సభలో తీవ్ర వాగ్వాదం   •   మున్సిపల్‌లో పైసల పంచాయతీ   •   మహిళా కోటా బిల్లుపై వాడివేడి చర్చ.. ప్రభుత్వానికి ఇంత తొందర ఎందుకు?   •   మార్కుల విషయంలో నిరాశ.. 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య   •  

పట్టణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా

02-06-2025 01:52 AM

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

జగిత్యాల అర్బన్, జూన్ 1 (విజయక్రాంతి): జగిత్యాల పట్టణ అభివృద్ధి ధ్యేయంగా పని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణ 29వ వార్డులో ఈద్గా వద్ద రు.15 లక్షలతో, దగ్గులమ్మ ఆలయం దగ్గర రు.21 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండతో జగిత్యాల పట్టణ సమగ్ర అభివృద్ది ధ్యేయంగా పనిచేస్తానన్నారు.

జగిత్యాల పట్టణంలో  రహదారులు, పార్కులు, మార్కెట్లు, ఓపెన్ జిమ్, డివైడర్లు, విద్య, వైద్యం అభివృద్ధి చేశామన్నారు.గాంధీనగర్ నుండి చలిగల్ వరకు రు.18 కోట్ల తో బ్లాక్ స్పాట్ రోడ్డు మంజూరు చేయడం జరిగిందన్నారు.29 వ వార్డులో దాదాపు 1 కోటి 50 లక్షలతో పనులు చేశామని, 1 కిమీ మేర యావర్ రోడ్డు విస్తరణ చేపట్టామన్నారు.త్వరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి నిధుల మంజూరు కోరుతూ కేంద్ర మంత్రులను సైతం కలవడం జరిగిందన్నారు.

రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం అని, అభివృద్ధి నిరంతర ప్రక్రియ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పందన, డిఈ వరుణ్, ఏఈ శరన్, మాజీ కౌన్సిలర్ పంబల రాము, బాలే శంకర్, దుమాల రాజ్ కుమార్, తోట మల్లికార్జున్,రాజాక్, ముకీద్, కుసర్, పట్టణ నాయకులు  పాల్గొన్నారు.