కవిత బెయిల్ బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండింటికీ విజయం
27-08-2024 04:44 PM
హైదరాబాద్: కవితకు బెయిల్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ 'ఎక్స్'లో స్పందించారు. ఈ బెయిల్ బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండింటికీ విజయం అని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అలుపెరగని ప్రయత్నాలు ఫలించాయని బీఆర్ఎస్ లీడర్ బెయిల్ పై బయటకు... కాంగ్రెస్ నేతకు రాజ్యసభ సీటు అని బండి ఎద్దెవా చేశారు. కవిత బెయిల్ కోసం వాదించిన అభ్యర్థికి మద్దతు ఇవ్వడం కేసీఆర్ రాజకీయ చతురత అని బండి సంజయ్ వెల్లడించారు.






