కడిగిన ముత్యంలా బయటకొస్తా.. కవిత బెయిలుపై బీఆర్ఎస్ సంబురాలు
హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో 153 రోజుల పాటు జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైలు నుంచి విడుదల నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబురాలలో మునిగి తేలారు. కడిగిన ముత్యంలా బయటకు వస్తా..అంటూ గతంలో అన్నారు. అదే మాదిరిగా మా కవితక్క కు జైలు నుంచి బయటకు వచ్చారని .. బీఆర్ఎస్ కార్యకర్త ఒకరు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు చేసుకున్నరు. తీన్ మార్ డప్పులు, బాణా సాంచా లతో తమ సంతోషం వ్యక్తం చేశారు. ఇది తప్పుడు కేసు అనీ, రాజకీయ ప్రేరేపిత మని పలువురు నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా బతుకమ్మ బావుటా పట్టుకుని ఇక తెలంగాణా ఆడబిడ్డలను పోరాటానికి సిద్ధం చేస్తుందన్నారు. మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, దాసోజు శ్రవణ్ కుమార్ సహా పలువురు నేతలు, కార్యకర్తలు సంబురాలలో పాల్గొన్నారు.






