బండి సంజయ్ పుట్టిన రోజు వేడుకలు
కేక్ కట్ చేసిన డిప్యూటీ మేయర్ సునీల్‌రావు తదితరులు
కరీంనగర్, జూలై 11 (విజయ క్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు కరీంనగర్‌లో ఘనంగా జరిగాయి. శనివారం బీజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పలువురు బీజేపి నాయకులు, కార్యకర్తలతో కలిసి భగత్‌నగర్ క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి... స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం డివిజన్ ప్రజలకు పూలు, పండ్లు, ఔషధ మొక్కలను పంపిణీ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే దాదాపు 60 మంది విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, షూస్, సాక్సులు, బెల్టులు, టై, బ్యాడ్జీలు, నోట్ బుక్స్, పెన్నులు, ఇతర స్టేషనరీ వస్తువులను పంపిణీ చేశారు. విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ జన్మదిన వేడుకల్లో బీజేపి నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.






