26 March, 2026 | 11:03 PM

లక్ష్మీదేవిపల్లి సర్పంచ్‌గా బంగారయ్య

01-12-2025 01:20 AM

ఏకగ్రీవంగా ఎన్నిక

గోపాలపేట, నవంబర్ 30: వనపర్తి జిల్లాలోని గోపాలపేట మం డలం లక్ష్మీదేవిపల్లి సర్పంచ్‌గా బంగారయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. నూతనంగా ఏర్పడిన లక్ష్మీదేవిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్‌గా ప్రజలు బంగారయ్యను ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. గతంలో బిఆర్‌ఎస్ పాలనలో దళిత బంధు పథకం 100% గ్రామానికి అమలు కావడంతో ఆ గ్రామం మొత్తం బిఆర్‌ఎస్ పార్టీకే పట్టం కట్టారు. బిఆర్‌ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ పోటీకి బంగారయ్యను దించారు.

అయితే గ్రామం లో సుమారుగా 500పై చిలుకు ఓటర్లు ఉండగా మరెవ్వరూ సర్పంచ్ పదవికి నామినేషన్ వేయలేదు. దీంతో బంగారయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి బంగారయ్యను అభినందించి శాలువా కప్పారు.  ఇదిలా ఉండగా బంగారయ్య బీఆర్‌ఎస్ పా ర్టీ కండువాలు వేసుకొని నామినేషన్ వేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెం దిన సత్య శిలారెడ్డి అనుచరులు తనను అడ్డుకొని కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని బలవంతంగా తన మెడలో వేసి ఘర్షణలకు దిగారని బంగారయ్య వాపోయారు.