17 August, 2026 | 3:38 AM

చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్

17-08-2026 01:59 AM
  1. ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం
  2. కంగారూ గడ్డపై తొలిసారి టెస్ట్ గెలుపు
  3. సరిపోని గ్రీన్ సెంచరీ పోరాటం

డార్విన్, ఆగస్టు 16: ప్రపంచ క్రికెట్‌లో బంగ్లాదేశ్ అద్భుతం చేసింది. టెస్ట్ ఫార్మాట్ లో తొలిసారి ఆస్ట్రేలియాను వారి సొంతగ డ్డపై చిత్తు చేసింది. డార్విన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నాలుగు రోజుల్లోనే బంగ్లా విజయా న్ని సొంతం చేసుకుంది.ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టు ఆరంభం నుంచే అద్భుతమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌట్ చేసింది.

అనంతరం తమ తొలి ఇన్నింగ్స్లో 426 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో 228 పరుగుల భారీ ఆధిక్యాన్ని దక్కించుకుంది. రెండో ఇన్నింగ్స్లోనూ ఆస్ట్రేలియా బ్యాటర్లు.. బంగ్లాదేశ్ బౌలర్ల దెబ్బకు నిలవలేకపోయా రు. హసన్ మహమూద్, మెహిదీ హసన్, తైజుల్ ఇస్లామ్లు కట్టుదిట్టమైన బౌలింగ్తో వణికించారు. ఆస్ట్రేలియా అగ్రశ్రేణి బ్యాటర్లైన స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, ట్రవిస్ హెడ్లను తక్కువ పరుగులకే పెవిలియన్కు పంపి ఆసీస్ను కోలుకోలేని దెబ్బతీశారు.

దీం తో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. ఒక్క వి కెట్ మాత్రమే కోల్పోయి 57 పరుగుల ల క్ష్యాన్ని ఛేదించింది. దీంతో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఆస్ట్రేలియాను వారి సొంత మైదానంలోనే మట్టికరిపించి ఈ చారిత్రాత్మక విజయాన్ని అందుకోవడం బంగ్లాదేశ్ క్రికెట్ ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. బంగ్లాదేశ్కు విదేశీ గడ్డపై ఇది పదో టెస్టు విజయం.

2009లో వెస్టిండీస్పు రెండు టెస్టులు గెలిచిన బంగ్లా.. 2013, 2021ల్లో జింబాబ్వే గడ్డపై లాంగ్ ఫా ర్మాట్లో గెలిచింది. 2017లో శ్రీలంక గడ్డ మీ ద టెస్టు మ్యాచ్ గెలిచిన బంగ్లాదేశ్.. 2022లో మౌంట్ మాంగనూయ్లో న్యూజిలాండ్ను మట్టి కరిపించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. 2024లో పాకిస్థాన్ గడ్డపై రెండు టెస్టులు గెలిచిన బంగ్లాదేశ్.. అదే ఏడాది జమైకాలో వెస్టిండీస్ను చిత్తు చేసింది. ఇప్పుడు ఏకంగా ఆస్ట్రేలియాను దాని సొంత గడ్డపై చిత్తు చేసి సంచలనం సృష్టించింది.