28 June, 2026 | 4:02 PM

Breaking News

లింగాపురం అంగన్వాడీ కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం   •   పల్స్ పోలియో చుక్కలు వేసిన బోధన్ ఆర్డీవో ఎం.విజయ కుమారి   •   పీవీ నరసింహారావుకు ఘన నివాళి   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •  

బంగ్లాదేశ్‌దే రెండో టెస్టు

05-12-2024 12:10 AM

కింగ్‌స్టన్: వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను బంగ్లాదేశ్ 1 డ్రాగా ముగించింది. జమైకా వేదికగా జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ 101 పరుగులతో ఘన విజయాన్ని సాధించింది. బంగ్లాదేశ్ విధించిన 287 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో విండీస్ 185 పరుగులకే కుప్పకూలింది. కవెమ్ హడ్జ్ (55) టాఫ్ స్కోరర్‌గా నిలవగా.. బ్రాత్‌వైట్ (44) పర్వాలేదనిపించాడు.

బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ 5 వికెట్లు తీయగా.. హసన్ మహుముద్, తస్కిన్ అహ్మద్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. 193/5 క్రితం రోజు స్కోరుతో నాలుగోరోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 268 పరుగులకు ఆలౌటైంది. జాకర్ అలీ (91) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. విండీస్ బౌలర్లలో రోచ్, అల్జారీ చెరో 3 వికెట్లు పడగొట్టాడు. విండీస్ గడ్డపై బంగ్లాదేశ్‌కు 15 ఏళ్ల తర్వాత టెస్టుల్లో ఇదే తొలి విజయం కావడం విశేషం.