కాంగ్రెస్ హయాంలో బంజారాలకు పెద్దపీట
బంజారాలతో కలిసి నృత్యం చేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
నిజామాబాద్, మార్చ్ 8(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా బోధన్ లో సంతు సేవాలాల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. పట్టణ శివారులోని బంజారా భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సేవలాల్ జె ఎన్ టి ఉత్సవాలకు ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వం ఆలయంలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బంజారాలకు పెద్దపీట వేస్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన రెండున్నరేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లు, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, మహిళా సంఘాలకు రుణాలు, మహిళలకు మహాలక్ష్మి పథకం ఇలా అనేక కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయన్నారు. ప్రతిపక్షాలు తమ పబ్బం గడుపుకునేందుకు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయన్నారు. అనంతరం బంజారాలతో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ ఛైర్‌పర్సన్ పద్మ స్టెప్పులు వేసి ఆడి పాడారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి, గ్రంథాలయ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నుడా ఛైర్మన్ వేణు తో పాటు బంజారా లు బంజారా నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.




