తప్పుడు ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ముషీరాబాద్, మార్చి 8(విజయక్రాంతి): ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బి) తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజి రెడ్డి కొనసాగుతారని ఏఐఎఫ్‌బీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి డి. దేవరాజన్ తెలిపారు. తప్పుడు ప్రచారాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర కమిటీ, పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నాయకత్వంపై ప్రచారం చేస్తున్న తప్పు డు, ఆధార రహిత వార్తలను దేవరాజన్ తీవ్రంగా ఖండించారు. పార్టీ తదుపరి రాష్ట్ర మహాసభ జరిగే వరకు, పార్టీ నిబంధనావళి ప్రకారం కొత్త రాష్ట్ర కమిటీ ఎన్నికయ్యే వరకు అంబటి జోజి రెడ్డి రాష్ట్ర కన్వీనర్ కొనసాగుతారని ఆయన తెలిపారు. పార్టీ సమిష్టి నిర్ణయాలను దెబ్బతీయడం లేదా పార్టీ ఐక్యతను బలహీనపరిచే చర్యలపై పార్టీ నిబంధనా వళి ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.




