10 March, 2026 | 9:05 PM

హాస్టల్‌పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

09-03-2026 12:36 AM

సికింద్రాబాద్, మార్చి 8(విజయక్రాంతి): హబ్సిగూడలోని ఓ హాస్టల్లో మూడో అంతస్తు నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బి. నాగేశ్వరరావు (59) అనే వ్యక్తి హబ్సిగూడలోని డీలక్స్ బాయ్స్ మెన్స్ హాస్టల్లో గత నెల రోజులుగా ఉంటున్నారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 3:17 గంటల సమయంలో హాస్టల్ మూడో అంతస్తులోని పెంట్ హౌస్ నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న ఓయూ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మహేష్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు ఇటీవల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఆ కారణంగానే ఆయన ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఓయూ పోలీసులు తెలిపారు.