27 June, 2026 | 4:39 PM

లయన్స్ క్లబ్ ఆఫ్ నేడుచర్ల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

27-06-2026 03:29 PM

నేరేడుచర్ల,(విజయక్రాంతి): లయన్స్ క్లబ్ ఆఫ్ నేరేడుచర్ల 2026–27 సంవత్సరానికి గాను నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా మాజీ గవర్నర్, మోటివేటర్,  మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ లయన్ గోలి అమరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై  మాట్లాడుతూ... లయన్స్ క్లబ్ సభ్యత్వమే మన గౌరవాన్ని, సేవాభావాన్ని సమాజంలో మరింత పెంచుతుందని, ప్రతి లయన్ సభ్యుడు సేవా కార్యక్రమాల్లో ముందుండి పాల్గొని, క్లబ్ సేవలను మరింత విస్తృత పరచాలని పిలుపునిచ్చారు.

2026-27 సంవత్సరంకు గాను నూతన అధ్యక్షులుగా షేక్ యూసుఫ్, కార్యదర్శిగా సరికొప్పుల నాగేశ్వరరావు, కోశాధికారిగా బదావత్ సైదులు నాయక్, ఉపాధ్యక్షులుగా నీలా శ్రీనివాస్, చిత్రం విశ్వనాథ్, మూలగుండ్ల వెంకటరెడ్డి, బసవ కోటేశ్వరరావు, తదితరులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్పర్సన్ కామా వెంకటేశం, రీజినల్ చైర్పర్సన్ ఏచూరి భాగ్యలక్ష్మి, చార్టర్ ప్రెసిడెంట్ కొనతం సీతారామరెడ్డి, డిస్ట్రిక్ట్ చైర్పర్సన్లు బట్టు మధు, చల్లా ప్రభాకర్ రెడ్డి, ఎడవెల్లి సత్యనారాయణ రెడ్డి, చార్టర్ సభ్యులు రాచకొండ రామ్మోహన్ రావు, రాచకొండ అంజయ్య, బాల వెంకటేశ్వర్లు, పూర్వ అధ్యక్షులు కందిబండ శ్రీనివాసరావు, జిలకర రామస్వామి మరియు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.