27 May, 2026 | 2:12 PM

సకాలంలో బ్యాంకు రుణాలు చెల్లించాలి: మేనేజర్ సత్య కిరణ్

27-05-2026 12:56 PM

బెజ్జూర్,(విజయక్రాంతి):  బ్యాంకులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి లాభాలు పొందవచ్చని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సత్య కిరణ్ తెలిపారు. బ్యాంకులో పంట రుణం తీసుకున్నట్లయితే సంవత్సరంలోపు చెల్లిస్తే తక్కువ వడ్డీ వర్తిస్తుందని తెలిపారు. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించడంతో వడ్డీ రేటు 7 శాతం మాత్రమే అంటే 58 పైసలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

రెగ్యులర్ గా చెల్లించడం వలన (3 % ) సబ్సిడీ వస్తుంది. వచ్చిన సబ్సిడీ రైతు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. పంట రుణం సకాలంలో చెల్లించడం వలన సిబిల్ స్కోర్ పెరుగుతుంది. సంవత్సరం దాటితే వడ్డీ రేటు 14% పెరుగుతుంది. పంట రుణాలు సకాలంలో చెల్లించి లాభాలు పొంది,బ్యాంకు అభివృద్ధికి సహకరించాలని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సత్య కిరణ్ కోరారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ప్రమాద బీమా తప్పనిసరిగా చేసుకున్నట్లయితే ప్రమాదం జరిగినప్పుడు కుటుంబానికి బీమా ఎంతగానో భరోసానిస్తుందని తెలిపారు.