27 May, 2026 | 2:39 PM

అబద్ధాలతో ప్రజలను మోసం చేయడం సరికాదు

27-05-2026 01:14 PM

ముకరంపుర, మే 27(విజయక్రాంతి): కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర సహాయ మంత్రి  బండి సంజయ్ కుమార్  కరీంనగర్‌ నగరపాలక సంస్థకు 840 కోట్లు మంజూరు చేయించాను అంటూ చేస్తున్న ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని  మాజీ కార్పొరేటర్,అడ్వకేట్ ఎ.వి.రమణ ఒక ప్రకటన ద్వార ఖండించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అర్బన్ చాలెంజ్ ఫండు పథకం యొక్క అసలు మార్గదర్శకాలను పరిశీలిస్తే, మొత్తం ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర ప్రభుత్వం నేరుగా భరించే మొత్తం  25 శాతం మాత్రమే. అంటే 840 కోట్ల ప్రాజెక్టు ఉంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ రూపంలో వచ్చే మొత్తం సుమారు 210 కోట్ల వరకు మాత్రమే  ఉందని మిగతా నిధులు రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ సంస్థలు, బ్యాంకు రుణాలు, మార్కెట్ ఫైనాన్సింగ్ మరియు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ ద్వారా సమీకరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో మొత్తం 840 కోట్లు కేంద్ర ప్రభుత్వం నేరుగా కరీంనగర్‌ కు ఇచ్చినట్లు ప్రచారం చేయడం సరికాదన్నారు.