09-12-2025 09:04:56 PM
వేములవాడ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా రెండు నెలల సెలవుపై అమెరికా వెళ్లి తిరిగి విధుల్లో చేరిన పి. నీరజ మంగళవారం పునః బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం ఆధ్వర్యంలో కార్యవర్గం ఆమెను మర్యాదపూర్వకంగా కలిసింది. శాలువాతో సన్మానించి,వేములవాడ శ్రీ రాజన్న లడ్డూ ప్రసాదం అందజేశారు. అనంతరం వేములవాడ కోర్టులో ఎదురవుతున్న పలు సమస్యలను జడ్జికి తెలియజేయగా, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని పి. నీరజ హామీ ఇచ్చినట్లు అధ్యక్షుడు సదానందం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కటకం జనార్ధన్, నాగుల సంపత్ కుమార్, గుజ్జే మనోహర్, కనికరపు శ్రీనివాస్, గంప మహేష్, కనపర్తి రాజశేఖర్, గుడిపెల్లి మహేష్, లేడీ రిప్రజెంటేటివ్ జక్కుల పద్మ పాల్గొన్నారు.