బండి భగీరథ్‌కు 14 రోజుల రిమాండ్
- పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు
- చట్టంపై గౌరవంతో అప్పగించా: బండి సంజయ్
మేడ్చల్, మే 16 (విజయక్రాంతి): బాలికపై లైంగిక దాడి ఆరోపణలతో పోక్సో కేసు నమోదైన బండి భగీరథ్‌కు మేడ్చల్ కోర్టు శనివారం రాత్రి 14 రోజుల రిమాండ్ విధించింది. అంతకుముందు భగీరథ్‌ను న్యాయ వాదుల సమక్షంలో నార్సింగి పోలీస్ అకాడ మీ వద్ద కుటుంబీకులు పోలీసులకు అప్పగించారు. అక్కడి నుంచి పోలీసులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణ అనంతరం అక్కడి నుంచి మేడ్చల్ కోర్టుకు పోలీసులు తరలించారు.
అక్కడ కేసు పూర్వపరాలను పరిశీలించిన కోర్టు భగీరథ్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు. కాగా ఈ నెల 8న పోక్సో కేసు నమోదైన తర్వాత బండి భగీరథ్ పరారీలో ఉన్నారు. పరారీలో ఉండగానే మధ్యంతర బెయిలు కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కో ర్టు బెయిల్ ఇవ్వలేదు. ఇదే సమయంలో భగీరథ్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. విదేశాలకు పారిపోకుండా లుక్ అవు ట్ నోటీసులు జారీ చేశారు.
ఈ క్రమంలోనే భగీరథ్ పోలీస్ అకాడమీ వద్ద లొంగిపోయాడు. కాగా మేడ్చల్ మెజిస్ట్రేట్ ఎదుట బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలం మరోసారి రికార్డు చేశారు. పోలీసులు ఇప్పటికే బాధితురాలు వాంగ్మూలం రెండుసార్లు నమోదు చేశారు. చట్టంపై గౌరవంతో తన కుమారుడిని పోలీసులకు అప్పగించానని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ఆధారాలు చూపేందుకే అప్పగింతలో జా ప్యం జరిగిందన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉన్నదని, అందరూ చట్టానికి లోబడి ఉండాలన్నారు.






