calender_icon.png 9 December, 2025 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయం, సమానత్వం సాధించేలా విజన్ డాక్యుమెంట్: సీఎం

09-12-2025 08:54:13 PM

హైదరాబాద్‌: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో అన్ని సెషన్లు ముగిశాయి. అనంతరం ముగింపు వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ.. తెలంగాణ నేల చైతన్యవంతమైన నేల అని.. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఎన్నో పోరాటాలు జరిగాయని పేర్కొన్నారు. స్వేచ్ఛ, సామజిక న్యాయం, సమానత్వం సాధించేలా విజన్ డాక్యుమెంట్ రూపొందించామని.. 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంతో ప్రధాని మోదీ ముందుకు సాగుతున్నారన్నారు.

కేంద్ర లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణ కూడా లక్ష్యాలు నిర్దేశించుకున్నాయని.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఎదగాలనే లక్ష్యం పెట్టుకున్నామని అన్నారు. పేదలు, రైతులు, వ్యాపారులు, యువతకు అభివృద్ది ఫలాలు దక్కేలా డాక్యుమెంట్ రూపకల్పన చేశామని.. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ ముఖ్యమని తొలి ప్రధాని నెహ్రూ భావించారన్నారు. అందుకే నెహ్రూ యూనివర్సిటీలు, సాగునీటి ప్రాజెక్టులు ఎక్కవగా నిర్మించారని.. నెహ్రూ చూపిన మార్గం చిరకాలం అనుసరణియమైనదని అన్నారు. కులం, మతం ఆధారంగా విద్యాసంస్థలు ఉండటం సరికాదని.. అన్ని కులాల వారు, మతాల వారు ఒకేచోట చదవాలనేది నా ఆశయం అని తెలిపారు. జాతి వివక్షను ప్రోత్సహించేలా విద్యా విధానం ఉండొద్దన్నారు.