calender_icon.png 1 May, 2025 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా బసవ జయంతి వేడుకలు

01-05-2025 01:22:12 AM

సిరిసిల్ల, ఏప్రిల్ 30(విజయక్రాంతి): బసవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం బసవ జయంతి వేడుకలను నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు. ముందుగా బసవేశ్వర చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజ మనోహర్ రావు, డీఆర్డీఓ శేషాద్రి, కుల సంఘం ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.